ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా బాధ్యతలను స్వీకరించిన పురందేశ్వరి
రాష్ట్రంలో రహదారుల దుస్థితేంటో ప్రజలను అడిగితే తెలుస్తుందని ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి విమర్శించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా ఆమె విజయవాడలోని పార్టీ కార్యాలయంలో నేడు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా పురందేశ్వరి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తామన్నారు. బీజేపీపై రాష్ట్రంలో దుష్ప్రచారం జరుగుతోంది. ఓట్లతో నిమిత్తం లేకుండా ఆంధ్రప్రదేశ్‌కు బీజేపీ సహకరిస్తోందన్నారు. కిసాన్ సమ్మాన్ నిధి కింద రైతులకు రూ.6వేలు ఇస్తున్నాం. రైతు భరోసా కింద ఇచ్చే డీబీటీల్లో కేంద్ర నిధులే ఉన్నాయి. రైతులకు రూ.12,500 ఇస్తామన్న జగన్ హామీ ఏమైంది? పదో తరగతి బాలుడిపై పెట్రోల్ పోసి చంపేశారు. అధికార పార్టీ ఎంపీ ఇంట్లో కిడ్నాపర్లు 2 రోజులున్నారు. ఇళ్ల నిర్మాణానికి 9 ఏళ్లలో రాష్ట్రానికి కేంద్రం రూ.20 వేల కోట్లు ఇచ్చింది. రాష్ట్రంలో ఇప్పటికే 65 శాతం ఇళ్ల నిర్మాణాలు పూర్తయి ఉండాలి. కానీ 35 శాతం కూడా పూర్తి కాలేదనేది వాస్తవం. ఈ విషయంలో పేదలకు వైసీపీ ప్రభుత్వం ఏం సమాధానం చెబుతుంది? రాష్ట్రంలో రహదారుల దుస్థితేంటో ప్రజలను అడిగితే తెలుస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులకు ఎవరూ ముందుకు రాని పరిస్థితి ఏర్పడిరది. ఉన్న పరిశ్రమలూ తరలిపోతున్నాయి అని విమర్శించారు.













