చంద్రబాబు హయాంలో ఉపాధిపై ప్రచారం
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధికారం చేపట్టాక ప్రభుత్వ, ప్రైవేటు రంగాలలో లక్షలాది ఉద్యోగాలు లభించాయి. అధికారం లోకి వచ్చిన కేవలం రెండున్నర సంవ త్సరాలలోనే ప్రభుత్వపరంగా వివిధ శాఖలలో 4,25,900 ఉద్యోగాలు కల్పించినట్టు అధికారవర్గాలు పాల్గొన్నాయి. ఇదే విషయమై ప్రచారంలో ప్రాధాన్యత కల్పించాలని నిర్ణయించారు. ఈ మేరకు ఉద్యోగాల కల్పనకు సంబంధించి ఒక జాబి తాను సిద్ధం చేశారు.
కాపు కార్పోరేషన్ ద్వారా 42,500 మందికి, బ్రాహ్మణ కార్పో రేషన్ ద్వారా 11,017 మందికి స్వయం ఉపాధి అవకాశాలు లభించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకున్న విషయమై ప్రచారం చేయనున్నారు. అలాగే ప్రైవేటు రంగంలోనూ 2014-18 మధ్య 3.30 లక్షల కోట్ల పెట్టు బడుల ద్వారా స్థాపించిన పారిశ్రామిక యూనిట్లతో 5.35 లక్షల ఉద్యోగాలు లభించినట్టు ప్రభుత్వం పేర్కొంది. మూడు దశలుగా నిర్వహించిన భాగస్వా మ్య సదస్సులలో కుదిరిన ఒప్పందాల ద్వారా పెద్ద ఎత్తున పెట్టుబడులతో పాటు మొత్తం 23,02,365 మందికి ఉద్యోగాలు వచ్చేందుకు దోహపడినట్టయిం దంటూ ప్రచారం చేయనున్నారు. 2016లో 290 ఎంవోయులు కుదరగా, 3,44,201 కోట్ల రూపాయల మేర ఒప్పందాలు కుదిరాయి. ఫలితంగా 7,03,727 మందికి ఉద్యో గావకాశాలులభించేందుకు మార్గం సుగమమైంది.
ప్రభుత్వం ప్రైవేటు రంగంలోనూ పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పించేందుకు ప్రాధాన్యతనిస్తున్నట్టు ప్రభుత్వం ప్రచారం చేయాలని సంకల్పించింది. భాగస్వామ్య సదస్సుల ద్వారానే ఈ మేరకు లక్ష్యాన్ని సాధించవచ్చనే అభిప్రాయం ముఖ్యమంత్రిలో వుంది. కాగా రాష్ట్రంలో ఇప్పటికే 3.30 లక్షల కోట్ల పెట్టుబడుల ప్రక్రియ కొనసాగుతుండగా, 5.35 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చాయని ప్రభుత్వం అంచనా వేసింది. రాష్ట్రం చేసుకున్న మొత్తం ఎంవోయూ లలో 65 శాతం పురోగతిలో వున్నాయి. కేవలం 941 ఒప్పందాల ద్వారానే 11,28,340 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దక్కనున్నాయని ప్రభుత్వం పేర్కొంటోంది. సమీప భవిష్యత్‌లోనూ రాష్ట్రంలో 28,845 పరిశ్రమల ద్వారా 15,11,106 కోట్ల రూపాయల పెట్టుబడులు రానుండగా, 33.5 లక్షల మందికి ఉపాధి అవకాశాలు సిద్దించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్దం చేస్తోంది.













