డిసెంబర్ 7న విశాఖకు రాష్ట్రపతి
భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ డిసెంబరు 7న విశాఖకు రానున్నారు. ఈ మేరకు జిల్లా కేంద్రానికి సమాచారం అందింది. తూర్పునౌకాదళం నిర్వహించే కార్యక్రమాల్లో పాల్గొనేందుకు విశాఖకు రానున్న రాష్ట్రపతి రెండురోజుల పాటు నగరంలో పర్యటించనున్నారు. 7న ఆర్కే బీచ్ కేంద్రంగా తూర్పునౌకాదళం నిర్వహించే కార్యక్రమాలను వీక్షించనున్నారు. 8న నౌకాదళం ఆధ్వర్యంలో జరగనున్న కలర్స్ ప్రజెంటేషన్ కార్యక్రమంలో పాల్గొనున్నారు. రాష్ట్రపతి పర్యటనకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ అధికారులను ఆదేశించారు.













