రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కు ఘనంగా వీడ్కోలు
యుద్ధ నౌకల సమీక్ష(పీఎఫ్ఆర్)లో పాల్గొనేందుకు విశాఖపట్నం వచ్చిన రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ న్యూఢిల్లీకి తిరుగు పయనమయ్యారు. విమానాశ్రయ సమీప ఐఎన్ఎస్ డేగాలో ఉదయం 10:20 గంటలకు ప్రత్యేక విమానంలో బయలుదేరారు. అంతకుముందు రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, శాసనసభ సభాపతి తమ్మినేని సీతారం, మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, విశాఖ, పాడేరు ఎంపీలు ఎంవీవీ సత్యనారాయణ, జి.మాధవి, తూర్పు నౌకాదళ అధిపతి వైస్ అడ్మిరల్ బిశ్వజిత్ దాస్ గుప్తా, నగర పోలీసు కమిషనర్ మనీష్ కుమార్ సిన్హా తదితరులు పుష్పగుచ్చాలు అందించి ఘన వీడ్కోలు పలికారు.













