అసాధ్యాన్ని సుసాధ్యం చేశాం
పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా ఒకే రోజు 11,153 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ వేసి జాతీయ రికార్డు సాధించి అసాధ్యాన్ని సుసాధ్యం చేశామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ఈ ఘనత సాధించిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు, నీటిపారుదల శాఖ అధికారులకు ఆయన అభినందనలు తెలిపారు. పోలవరాన్ని అనుకున్న సమయానికి పూర్తి చేయడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు కృషి చేస్తున్నారు. దేశంలో 16 జాతీయ ప్రాజెక్టులు నిర్మాణ దశలో ఉంటే కేవలం 5 ప్రాజెక్టుల పనులు మాత్రమే జరుగుతున్నాయి. అందులో ఒక్క పోలవరం పనులు మాత్రమే వేగంగా జరుగుతున్నాయి. పోలవరంలో ఇంత పెద్ద ఎత్తున పనులు జరుగుతుంటే ప్రాజెక్టును అడ్డుకోవడానికి విపక్షాలు అసత్యాలు ప్రచారం చేయడం దారుణం అని అన్నారు.













