Shivaji: శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని సందర్శించిన ప్రధాని మోదీ

కర్నూలు పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) శ్రీశైలంలో శివాజీ (Shivaji) స్ఫూర్తి కేంద్రాన్ని సందర్శించారు. రాజ దర్బార్ గోడలపై ఛత్రపతి శివాజీ జీవిత చరిత్రను తెలిపే శిల్పాలను ఆసక్తిగా పరిశీలించారు. అక్కడ శివాజీ విగ్రహం వద్ద నమస్కరించారు. శివాజీ దర్బార్ హాల్, ధ్యాన మందిరాలను పరిశీలించారు. ధ్యానముద్రలో ఉన్న శివాజీ, అమ్మవారి విగ్రహాలను దర్శించుకున్నారు. అమ్మవారి విగ్రహానికి భక్తిశ్రద్ధలతో పుష్పాలను సమర్పించారు. ప్రధానితో పాటు చంద్రబాబు (Chandrababu) , డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) శివాజీ స్ఫూర్తిని కేంద్రానికి వెళ్లారు. ఈ కేంద్రం నిర్వహణ బాగుందని ట్రస్టు నిర్వాహకులకు ప్రధాని మోదీ అభినందించారు. అక్కడి నుంచి భ్రమరాంబ గెస్ట్‌హౌస్‌కు వెళ్లారు.