Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కు.. ప్రధాని మోదీ ఫోన్
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) చిన్న కుమారుడు మార్క్ శంకర్ (Mark Shankar) ఆరోగ్యంపై ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi ) ఆరా తీశారు. పవన్‌కు ఫోన్ చేసి అతడి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. సింగపూర్ (Singapore)లోని ఓ స్కూల్లో జరిగిన అగ్ని ప్రమాదం లో మార్క్ శంకర్ గాయపడిన విషయం తెలిసిందే. కాళ్లు, చేతులకు కాలిన గాయాలు కావడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే, విశాఖ పర్యటన (Visakhapatnam tour) లో ఉన్న పవన్‌కు ప్రధాని మోదీ ఫోన్ చేసి అతడి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీసినట్లు సమాచారం. మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన ప్రధాని, పవన్‌కు ధైర్యం చెప్పినట్లు తెలిసింది.













