సీఎం చంద్రబాబుకు మోడీ ఫోన్
కేంద్ర ప్రభుత్వం నుంచి తెలుగుదేశం పార్టీ మంత్రులు వైదొలగాలని నిర్ణయించిన నేపథ్యంలో ప్రధాని మోదీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఫోన్ చేశారు. రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై కూర్చుని మాట్లాడుకుందామని ప్రతిపాదించారు. తొందరపడొద్దని సూచించారు. నిన్న మీరు నాకోసం ఫోన్ చేశారు. అప్పటికే రాత్రి బాగా ఆలస్యమైంది. గురువారం ఉదయమే రాజస్థాన్ పర్యటనకు వెళ్లి తిరిగొచ్చిన వెంటనే ఫోన్ చేస్తున్నా అని మోదీ పేర్కొన్నట్లు టీడీపీ వర్గాల సమాచారం. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ రాష్ట్రానికి సంబంధించిన సమస్యల పరిష్కారానికి నాలుగేళ్లపాటు వేచి చూశాం. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌జైట్లీ ప్రకటనతో ఇక ఆ సమస్యల పరిష్కారం సాధ్యం కాదని అర్థమైంది. ప్రభుత్వంలో కొనసాగలేమన్న నిర్ణయం తీసుకున్నాం. ఆ విషయం మీకు చెప్పేందుకు ఫోన్ చేశారు. రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై మాట్లాడదామన్న మోదీ ప్రతిపాదనపై స్పందిస్తూ, కేంద్ర బడ్జెట్‌కు ముందుగానే మీకు సవిరమైన నివేదిక ఇచ్చాను. మేమింకా ఎన్డీఏలోనే ఉన్నాం. మంత్రి పదవులు ముఖ్యం కాదు. ప్రజల దృష్టి కోణమే ప్రధానం. ఇప్పుడైనా మేం ప్రస్తావించిన సమస్యలను పరిష్కరించండి అని సూచించారు.













