ఇది కచ్చితంగా మానవ హక్కుల ఉల్లంఘన : పవన్ కల్యాణ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కాకినాడ, కర్నూలు నగరపాలక సంస్థల పరిధిలో ఆస్తి, చెత్త పన్నులకు సంబంధించి జరిగిన వ్యవహారాలపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల మంచి కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన చేస్తున్నట్లు కనిపించడం లేదని విమర్శించారు. పన్ను కట్టకపోతే సామాన్లు పట్టుకుపోతామని కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది ట్రాక్లర్లు వేసుకొని తిరుగడం ఏం సూచిస్తోందని ప్రశ్నించారు. చెత్త సేకరణకు పన్ను విధించటమే ఒక దౌర్భాగ్యం అనుకొంటే దాన్ని వసూలు చేస్తున్న విధానం మరింత దిగజారిపోయేలా ఉందన్నారు. కర్నూలులో వ్యాపారులు చెత్త పన్ను చెల్లించలేదని దుకాణాల ముందు చెత్తను వేసి అవమనిస్తారా అని ధ్వజమెత్తారు. ఇది కచ్చితంగా మానవ హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందని అన్నారు. ప్రజలు గౌరవప్రదంగా జీవించడం ఈ ప్రభుత్వానికి నచ్చడం లేదని అన్నారు.













