ఎమ్మెల్యే శ్రీదేవికి కరోనా పాజిటివ్

ఆంధప్రదేశ్ రాష్ట్రంలోని పత్తికొండ నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవికి కరోనా పాజిటివ్‍గా నిర్ధారణ అయ్యింది. ప్రస్తుతం ఎమ్మెల్యే శ్రీదేవి హోమ్ ఐసోలేషన్‍లో చికిత్స తీసుకుంటున్నారు. తనకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినందున.. గత మూడు రోజుల నుండి తనను కలిసిన నాయకులు, కార్యకర్తలు కరోనా టెస్ట్ చేయించుకోవాలని కోరారు. అందరూ తప్పని సరిగా కరోనా జాగ్రత్తలు పాటించాలని విజ్ఞప్తి చేశారు.