ఏపీ అభివృద్ధే ప్రధాన అజెండా… ఎంపీలకు చంద్రబాబు దిశానిర్దేశం
ఆంధ్రప్రదేశ్ అభివృద్దే ప్రధాన అజెండాగా పోటీ పడి పనిచేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. ఈ నెల 22 నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. మంత్రుల నుంచి వివిధ శాఖలకు చెందిన సమాచారం తీసుకుని కేంద్రంతో సంప్రదింపులు జరపాలని సీఎం సూచించారు. అవసరాన్ని బట్టి రాష్ట్ర మంత్రులను వెంటబెట్టుకుని ఆయా శాఖలకు చెందిన కేంద్రమంత్రులను కలవాలని ఆదేశించారు. అమరావతి, పోలవరం ప్రాజెక్టుకు రావాల్సిన నిధులపై భేటీలో చర్చించారు. ఢల్లీిలో జగన్ ధర్నా చేయనున్నారన్న అంశం భేటీలో ప్రస్తావనకు వచ్చినట్టు సమాచారం. జగన్, అతని పార్టీ గురించి ఆలోచన చేయాల్సిన అవసరం లేదని పలువురు ఎంపీలు అన్నట్లు తెలుస్తోంది. జగన్ గురించి ఒక్క క్షణం ఆలోచించే సమయాన్ని కూడా రాష్ట్రాభివృద్ధి కోసం వెచ్చించాలని ఓ మంత్రి అన్నట్లు తెలిసింది. ఢల్లీిలో జగనేం చేస్తారో ముఖ్యం కాదని, మనమేం చేయాలనేది ముఖ్యమని స్పష్టం చేశారు.













