రాప్తాడు బరిలో పరిటాల శ్రీరాం ?
అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా తన కుమారుడు పరిటాల శ్రీరాం పోటీ చేస్తారని మంత్రి పరిటాల సునీత ప్రకటించారు. రాప్తాడు నియోజకవర్గం కనగానపల్లి మండలం ముత్తువకుంట్ల నుంచి ఆమె ప్రచారం ప్రారంభించారు. పెద్దఎత్తున టీడీపీ శ్రేణులు, పరిటాల అభిమానులు పాల్గొన్నారు. సునీత మాట్లాడుతూ జిల్లాలో తమ కుటుంబానికి 2 సీట్లు ఇవ్వాలని చంద్రబాబును కోరామని, అకాశమిస్తే ఇద్దరం బరిలో ఉంటామని తెలిపారు. లేకపోతే రాప్తాడులో తన బదులు శ్రీరాం పోటీచేస్తారని చెప్పారు. ముఖ్యమంత్రి నిర్ణయం మేరకు నడుచుకుంటామని సునీత పేర్కొన్నారు.













