పరకాల ప్రభాకర్ రాజీనామా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పదవికి డాక్టర్ పరకాల ప్రభాకర్ తన పదవికి రాజీనామా చేశారు. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి చేసిన వ్యాఖ్యలు తనను కలచివేశాయని, అందుకే రాజీనామా చేస్తున్నానని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు తన రాజీనామా లేఖను పంపించినట్లు తెలిపారు. జగన్ కొన్ని రోజులుగా తనపై చేస్తున్న నిందా ప్రచారంపై కలత చెందానని, తక్షణమే తన రాజీనామాను ఆమోదించాలని లేఖలో ముఖ్యమంత్రిని కోరారు. నాలుగేళ్లుగా ప్రభుత్వానికి సలహాదారుడిగా వ్యవహరిస్తున్న ప్రభాకర్ నవ్యాంధ్రప్రదేశ్ పునర్నిర్మాణంలో కీలక భూమిక పోషించారు. పరకాల ప్రభాకర్ సతీమణి నిర్మలా సీతారామన్ భారత రక్షణశాఖ మంత్రిగా ఉన్నారు.













