Palla Srinivasa Rao: పులివెందులలో ఎన్నికలు సక్రమంగా జరిగాయి: పల్లా శ్రీనివాసరావు
పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నిక పోలింగ్ ముగిసిన తర్వాత, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు (Palla Srinivasa Rao) సంచలన వ్యాఖ్యలు చేశారు. పులివెందులలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగాయని ఆయన అన్నారు. గత వైసీపీ ప్రభుత్వ పాలనలో పులివెందులలో (Pulivendula) స్వేచ్ఛగా ఎన్నికలు జరగలేదని ఆయన విమర్శించారు. ఇప్పుడు టీడీపీ అభ్యర్థులు ఎలాంటి భయం లేకుండా నామినేషన్లు వేశారని ఆయన (Palla Srinivasa Rao) తెలిపారు. ఈ ఉప ఎన్నికల్లో పులివెందుల, ఒంటిమిట్టలో మొత్తం 11 నామినేషన్లు వచ్చాయని, వైసీపీకి 11 అదృష్ట సంఖ్య అని ఎద్దేవా చేశారు. ఈ ఎన్నికల్లో టీడీపీ విజయకేతనం ఎగురవేస్తుందని పల్లా శ్రీనివాసరావు (Palla Srinivasa Rao) ధీమా వ్యక్తం చేశారు.







