High Court: ఏపీ హైకోర్టు న్యాయమూర్తుల ప్రమాణ స్వీకారం

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తులుగా నలుగురు న్యాయమూర్తులు ప్రమాణ స్వీకారం చేశారు. జస్టిస్ నూనేపల్లి హరినాథ్ (Nunepally Harinath), జస్టిస్ మండవ కిరణ్మయి (Mandava Kiranmayi), జస్టిస్ జగడం సుమతి (Jagadam Sumati) , జస్టిస్ న్యాపతి విజయ్‌లు ప్రమాణస్వీకారం చేశారు. వీరందరితో హైకోర్టు సీజే జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్ ప్రమాణం చేయించారు. ఈ సందర్భంగా సీజే నలుగురు న్యాయమూర్తులకు అభినందనలు తెలిపారు.