Jai Hanuman: జై హనుమాన్ పరిస్థితేంటి?
కాంతార(kanthara) సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు కన్నడ హీరో రిషబ్ శెట్టి(Rishab Shetty). కాంతార(Kanthara) సినిమాతో రిషబ్ చాలా మంచి క్రేజ్, ఫాలోయింగ్ సంపాదించుకుని పలు భాషల్లో మార్కెట్ ను పెంచుకున్నాడు. ప్రస్తుతం రిషబ్ శెట్టి నటించిన కాంతార1(kanthara1) రిలీజ్ కు రెడీ అవుతుండగా, ఈ సినిమాతో మరోసారి పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల్ని అలరించడానికి రెడీ అవుతున్నాడు రిషబ్.
కాగా రిషబ్ చేతిలో ప్రస్తుతం రెండు తెలుగు ప్రాజెక్టులున్నాయి. అందులో ఒకటి జై హనుమాన్ కాగా మరోటి రీసెంట్ గా సితార ఎంటర్టైన్మెంట్స్(Sithara Entertainments) బ్యానర్ లో అనౌన్స్ చేసిన సినిమా. సితార నుంచి అనౌన్స్మెంట్ రావడంతో ఇప్పుడు జై హనుమాన్(Jai Hanuman) పరిస్థితేంటని అందరి మదిలో ప్రశ్న మెదులుతుంది. వాస్తవానికి జై హనుమాన్ ఎప్పుడో రిలీజవాల్సింది కానీ రిషబ్ మధ్యలో వేరే ప్రాజెక్టులతో బిజీగా ఉండటంతో ఈ సినిమా లేటైనట్టు టాక్ వినిపించింది.
మరి జై హనుమాన్ సినిమాను డైరెక్టర్ ప్రశాంత్ వర్మ(Prasanth Varma) సైలెంట్ గా కంప్లీట్ చేశాడా లేదా ఇంకా షూటింగ్ పెండింగ్ ఉందా అనేది మాత్రం తెలియాల్సి ఉంది. తేజ సజ్జ(Teja Sajja) హీరోగా వచ్చిన హను మాన్(Hanu Man) సినిమా పాన్ ఇండియా స్థాయిలో సూపర్ సక్సెస్ అవడంతో జై హనుమాన్ పై అందరికీ చాలా భారీ అంచనాలున్న విషయం తెలిసిందే.







