Minister Ramanaidu: అబద్ధాలు చెప్పడంలో అంబటికి ఆస్కార్ : మంత్రి నిమ్మల

పోలవరం ప్రాజెక్టు (Polavaram Project ) పై చర్చకు సిద్దమా అని వైసీపీ నేత అంబటి రాంబాబు (Ambati Rambabu) సవాల్ విసరడం సిగ్గుచేటని రాష్ట్ర మంత్రి నిమ్మల రామానాయుడు (Nimmala Ramanaidu) అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు లో స్మార్ట్ రేషన్ కార్డు (Smart Ration Card) లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రామానాయుడు మాట్లాడుతూ అబద్ధాలు అతికినట్లు చెప్పడంలో అంబటికి ఆస్కార్(Oscar) ఇవ్వొచ్చని ఎద్దేవా చేశారు. పోలవరం పూర్తి చేయకుండా ఆయన చేతులెత్తశారన్నారు. ఇరిగేషన్ మంత్రిగా పనిచేసిన అంబటికి పోలవరం గురించి అర్థం కాలేదు. మా పార్టీ దిగువ శ్రేణి నేతలకు ఉన్న అవగాహన ఆయనకు లేదు. గత ప్రభుత్వం పాపం వల్లే డయాఫ్రం వాల్ కొట్టుకుపోయింది. ఉనికి కాపాడుకునేందుకే వైసీపీ అడ్డదారులు తొక్కుతోంది అని విమర్శించారు.