ఏపీ విద్యార్థులకు రాయితీలపై యూఎస్ వర్సిటీలతో చర్చలు
అమెరికాలో చదువుకునేందుకు ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్లే విద్యార్థులకు రుసుముల్లో రాయితీ కల్పించడంతోపాటు పరిశోధన విభాగంలో భాగస్వామ్యానికి పలు ఒప్పందాలు చేసుకునే క్రమంలో యంగ్ స్టౌన్ స్టేట్ యూనివర్సిటీ ఉన్నతాధికారులతో ఏపీ ఉన్నత విద్యామండలి సలహాదారు ఈదర్ వెంకట్ చర్చించారు. మంత్రి గంటా శ్రీనివాసరావు ఆదేశాల మేరకు ఆయన వర్సిటీని సందర్శించారు. యంగ్ స్టౌన్ స్టేట్ వర్సిటీ ప్రతినిధులు డాక్టర్ నీల్ మెక్ నల్లీ, గ్యారీ షీహన్, శాల్శాండర్స్తో సమావేశమై పలు అంశాలపై చర్చించారు. అనంతరం కెంట్ స్టేట్ వర్సిటీ, క్లీవ్ ల్యాండ్ స్టేట్ వర్సిటీ ప్రతినిధులతోనూ ఆయన సమావేశమయ్యారు.













