నిర్మాణ నగరంలో భాగస్వాములుకండి : చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్‌లో తలపెట్టిన నిర్మాణ నగరంలో భాగస్వాములు కావాలంటూ సింగపూర్‌కి చెందిన పారిశ్రామికవేత్తలు, నిర్మాణరంగ ప్రముఖులకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. ఏపీ-సింగపూర్ పారిశ్రామికవేత్తల రౌండ్ టేబుల్ సమావేశంలో చంద్రబాబు పాల్గొన్నారు. ముఖాకృతి గుర్తింపు, సమాచార విశ్లేషణ, పరిశోధన కేంద్రాన్ని (నెక్ ల్యాబ్) ముఖ్యమంత్రి సందర్శించారు. రాష్ట్రంలో బయోమెట్రిక్, ఫేషియల్ రికగ్నిషన్, ఐరిస్ సాంకేతికతను ఇప్పటికే వినియోగిస్తున్నామని, మరో అడుగు ముందుకేసి తర్వాతి దశ సాంకేతికను వినియోగించుకోవాలని భావిస్తున్నామని చంద్రబాబు తెలిపారు. సింగపూర్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిటీ సొల్యూషన్స్ సింగపూర్ ఎగ్జిబిషన్ ను చంద్రబాబు సందర్శించారు. ఆకర్షణీయ పట్టణ నివాస ప్రాంతాల విభాగాన్ని ఆసక్తిగా పరిశీలించారు. పట్టణ జనాభా అవసరాలకు తగ్గట్టు, పరిమిత స్థలంలోనే అందరికీ గృహ నిర్మాణం ఎలా చేపట్టవచ్చో అక్కడి ప్రతినిధుల్ని అడిగి తెలుసుకున్నారు. ప్రపంచనగరాల సదస్సులో రాజధాని అమరావతికి సంబంధించి సీఆర్డీఏ ప్రత్యేక పెలిమియన్ను ఏర్పాటు చేసింది. దాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు.













