Nara Lokesh : తెలుగు జాతి కోసం పుట్టిన ఏకైక పార్టీ టీడీపీ : మంత్రి లోకేశ్
పేదల కడుపు నిండా భోజనం పెట్టిన పార్టీ తెలుగుదేశం అని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) అన్నారు. కడప (Kadapa) లో నిర్వహించిన మహానాడులో ఆయన మాట్లాడారు. తెలుగు జాతి కోసం పుట్టిన ఏకైక పార్టీ టీడీపీ అని అన్నారు. మనకు ప్రతిపక్షం కొత్తకాదు, అధికారం కొత్త కాదు. భవిష్యత్తు కోసం ఆరు శాసనాలను ప్రతిపాదిస్తున్నా. అవి 1. తెలుగుజాతి విశ్వఖ్యాతి. 2. యువగళం, 3. స్త్రీశక్తి, 4. పేదల సేవల్లో సోషల్ రీఇంజినీరింగ్, 5. అన్నదాతకు అండగా, 6. కార్యకర్తలే అధినేత. అన్ని రంగాల్లో మన తెలుగువారు ప్రపంచంలోనే ముందుండాలి. పనిచేసేవారిని ప్రోత్సహిస్తాం. ఎత్తిన పసుపు జెండా దించకుండా కార్యకర్తలు పార్టీకి కాపలా కాశారు. ప్రతి కార్యకర్తకు శిరస్సు వంచి పాదాభివందనాలు చేస్తున్నా. ఎన్టీఆర్ పార్టీ (NTR Party) పెట్టిన ముహూర్త బలం చాలా గట్టిది. తెలుగు వాళ్లు ఎక్కడ ఇబ్బంది పడినా స్పందించేది మన పార్టీనే. ప్రజలకు మరింత దగ్గరయ్యేందుకు ఎప్పటికప్పుడు నేతలు, కార్యకర్తలు కష్టపడాల్సిందే. ప్రణాళికలు సిద్ధం చేసి, మహానాడు (Mahanadu) లో చర్చించి నిర్ణయాలు తీసుకుందా. తెలుగువారి ఆత్మగౌరవం పార్టీ సిద్ధాంతం అని తెలిపారు.













