ఐసీయూలో ఉన్న వైసీపీకి బీజేపీ ఆక్సిజన్ ఇస్తోంది
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఐసీయూలో ఉందని, దానికి బీజేపీ ఆక్సిజన్ అందిస్తోందని మంత్రి నారా లోకేశ్ అన్నారు. మహానాడులో రెండో రోజైన మంత్రి మాట్లాడుతూ వైసీపీకి ఓటేస్తే బీజేపీకి వేసినట్లేనని అన్నారు. ఉద్దానానికి ఏమీ చేయలేదనడం సరికాదని, కిడ్నీ వ్యాధి ప్రబలిన చోట ఆర్వోసీ ఫ్లాంట్లు ఏర్పాటు చేశామని వెల్లడించారు. తాను ఎప్పుడు, ఎక్కడ తప్పు చేశానో ఆధారాలతో నిరూపించాలని ఆయన సవాల్ చేశారు. ప్రతిపక్ష నేతలు కావాలనే తనపై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. తాత ఎన్టీఆర్కు చెడ్డపేరు తెచ్చే పని ఎప్పటికీ చేయనని సృష్టం చేశారు. తిరుపతి వెంకన్న పేరుతో రాజకీయాలు చేస్తున్నారని, శ్రీవారి జోలికి వెలితే మాడి మసైపోతారని అన్నారు.
రూ.162 కోట్లతో 1750 పంచాయతీ భవనాల నిర్మాణం చేపట్టామన్నారు. 17వేల కిలోమీటర్ల మేర సీసీ రోడ్లు వేశామని వెల్లడించారు. ఉపాధి హామీలో అవినీతి జరుగుతోందని అసత్య ప్రచారం చేస్తూ, కేంద్రం నుంచి నిధులు కాకుండా వైసీపీ నేతలు అడ్డుపడ్డారని ఆరోపించారు. కేంద్రం నిధులు ఇవ్వకపోతే రాష్ట్ర బడ్జెట్ నుంచి రూ.1120 కోట్లు ఇచ్చామన్నారు. 2022 నాటికి ఇంటింటికి కుళాయి ఏర్పాటు చేస్తామని అన్నారు. పైలెట్ ప్రాజెక్టులుగా పశ్చిమగోదావరి జిల్లా, కృష్ణ జిల్లాలకు 6 నెలల్లోనే ఇంటింటికి కుళాయి వస్తుందని తెలిపారు. 68 ఏళ్ల వయస్సులో రాష్ట్రం కోసం నిత్యం ముఖ్యమంత్రి కష్టపడుతున్నారని తెలిపారు. చంద్రబాబును భారీ మెజార్టీతో మళ్లీ ముఖ్యమంత్రిని చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.













