కరోనాతో బాధితులు చనిపోలేదు… ప్రభుత్వమే
కరోనాతో బాధితులు చనిపోలేదని, ప్రభుత్వమే చంపేసిందని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆరోపించారు. రుయా ఆస్పత్రిలో మరణాలపై ప్రభుత్వ కారణాలన్నీ అవాస్తమని అన్నారు. 11 మంది కాదు 30 మంది మరణించినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారని అన్నారు. ఆక్సిజన్ కొరతతో రాష్ట్రంలో ఇప్పటికే 76 మందికి పైగా చనిపోయారు. పడకలు దొరక్క ఆక్సిజన్ లేక ఆస్పత్రుల్లో ప్రజలు చనిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన వసతులు కల్పించాలన్నారు. మృతుల కుటుంబాలను తక్షణమే ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం వాస్తవాలు బయటపెట్టాలన్నారు. మీడియాపై ఆంక్షలు, ప్రతిపక్ష నేతల అరెస్టులతో వాస్తవాలు దాగవు అని అన్నారు. కరోనాతో ప్రజలు చనిపోతుంటే వైకాపా నేతలు గుర్రపు స్వారీలు ఆస్వాదిస్తున్నారని మండిపడ్డారు. వైకాపా ఎమ్మెల్యేలు సరదాల్లో ముగిని తేలడం దారుణమన్నారు.













