రాష్ట్రంలో మళ్లీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం : లోకేశ్
రాష్ట్రవ్యాప్తంగా అనేక చోట్ల ఈవీఎంలు మొరాయించాయని మంత్రి నారా లోకేశ్ అన్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లి లోని క్రిస్టియన్‌పేట మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల సమీపంలో మీడియాతో మాట్లాడారు. దేశంలోనే మొదటిసారిగా అధికార పార్టీ నాయకులపై విచక్షణ రహితంగా ప్రతిపక్ష పార్టీ నాయకులు దాడులకు తెగబడ్డారు. ఎన్నికల సంఘం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసింది అని విమర్శించారు. రాష్ట్రంలో టీడీపీ గెలుపు ఖాయమేనని, మళ్లీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని లోకేశ్ ధీమా వ్యక్తం చేశారు. ఈవీఎంలు పనిచేయక ఆలస్యంగా పోలింగ్ ప్రారంభమైన కేంద్రాల్లో రీపోలింగ్ నిర్వహించాలని కోరతామన్నారు.













