ఫస్ట్ అమెరికన్ ప్రతినిధులతో మంత్రి లోకేష్ భేటీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కంపెనీ ఏర్పాటుకు ఫస్ట్ అమెరికా (ఇండియా) కంపెనీ ముందుకు వచ్చింది. మంత్రి నారా లోకేష్‌తో ఫస్ట్ అమెరికా (ఇండియా)కంపెనీ వైస్ ప్రెసిడెంట్ రఘు, ప్రతినిధులు సమావేశమయ్యారు. ల్యాండ్ రికార్డ్స్ బ్లాక్ చైన్ టెక్నాలజీ వేదికపైకి తీసుకొస్తున్నామని ఈ సందర్భంగా లోకేష్ తెలిపారు. రాష్ట్రంలో ఫైబర్ గ్రిడ్ ఏర్పాటు చేశామన్నారు. ఏపీలో కంపెనీ ఏర్పాటు చేయాలని మంత్రి లోకేష్ కోరారు. దీనిపై కంపెనీ ప్రతినిధులు స్పందిస్తూ విజయవాడలో కంపెనీ ఏర్పాటు చేసి కార్యకలాపాలు విస్తరిస్తామని తెలిపారు. టైటిల్, ఇన్సూరెన్స్ ఫస్ట్ అమెరికన్ కంపెనీ అందిస్తోంది.













