3 రాజధానులు కాదు.. 3 ముక్కల రాజధాని
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై తెలుగుదేశం పార్టీ నేత నారా లోకేష్ విరుచుపడ్డారు. జగన్ తుగ్లక్‌లా పాలన చేస్తున్నాడని ఆరోపించారు. అభివృద్ది వికేంద్రీకరణ జరగాలని చంద్రబాబు పనిచేశారని, ఏపీకి రావాల్సిన పెట్టుబడులు తెలంగాణకు వెళ్లాయని విమర్శించారు. రిలయన్స్ని చంద్రబాబు బినామీ కంపెనీ అన్నారని, విశాఖ నుంచి లూలు కంపెనీని వెనక్కి పంపించారని మండిపడ్డారు. 3 రాజధానులు కాదు..3 ముక్కల రాజధాని అని ఆరోపించారు. పసిబిడ్డ అమరావతిని 3 ముక్కలుగా నరికేశారని, ఆందోలన చేస్తున్న రైతుల్ని పెయిడ్ ఆర్టిస్టులు అంటారా అని ప్రశ్నించారు. జగన్ బంగారం, డబ్బు తింటున్నారా లేక రైతు పండించిన అన్నం తింటున్నారా అని నిలదీశారు.
ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై వైసీపీ పెయిడ్ ఆర్టీస్టులే రాళ్లు వేశారని చెప్పారు. 11 మంది రైతులు చనిపోతే వైసీపీ నేతలు మాట్లాడలేదని అన్నారు. ఐదేళ్లలో రైతులు ఎప్పుడైనా రోడ్డెక్కారా అని మరోసారి ప్రశ్నించారు. ఒక రైతుపైన 9 సెక్షన్లు పెడతారా అని నిలదీశారు. రావాలి జగన్..కావాలి జగన్ అన్నారు. ఇప్పుడు పోవాలి జగన్ .. వద్దు జగన్ అంటున్నారు. 3 రాజధానులని మేనిఫెస్టోలో చెప్పారా అని ప్రశ్నించారు.













