జైల్లోనే బాబును అంతమొందించే కుట్ర : లోకేష్
అనారోగ్య కారణాలతో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబును అంతమొందించే కుట్ర జరుగుతోందని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆరోపించారు. ఈ సందర్భంగా లోకేష్ మీడియాతో మాట్లాడుతూ వ్యవస్థలను మేనేజ్ చేస్తూ చంద్రబాబును రిమాండ్‌లోనే ఉంచాలనే కుట్ర జరుగుతోందని మండిపడ్డారు. చంద్రబాబు జీవితం ప్రమాదంలో ఉంది. భద్రతలేని జైలులో ఆరోగ్యం క్షీణించేలా చేసి ప్రాణహాని తలపెడుతున్నారు. ఏ తప్పూ చేయని చంద్రబాబు పట్ల ఈ ప్రభుత్వం రాక్షసంగా వ్యవహరిస్తోంది. చంద్రబాబు ఆరోగ్యంపై జైలు అధికారుల తీరు సందేహాస్పదంగా ఉంది. చంద్రబాబుకు ఏ హాని జరిగినా, జగన్ సర్కార్, జైలు అధికారులదే బాధ్యత. చంద్రబాబు ఆరోగ్యంపై ఎందుకీ కక్ష? అని ప్రశ్నించారు. జైలులో దోమలు ఎక్కువ ఉన్నాయన్నా అధికారులు పట్టించుకోలేదు. చన్నీళ్లు ఇస్తున్నారనన్నా లెక్క చేయలేదు. సరిగా తిరగని ఫ్యాన్ పెట్టారు. చంద్రబాబు బరువు తగ్గిపోయారు. అలర్జీ వచ్చింది. డీ హైడ్రేషన్‌కు గురయ్యారు. జైలు పరిసరాలు అపరిశుభ్రంగా ఉన్నాయి అని మండిపడ్డారు.













