వాళ్ల అభివృద్ధికి నిరంతరం శ్రమిస్తా : లోకేశ్
మంగళగిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నారా లోకేశ్ పర్యటిస్తున్నప్పుడు చిన్నారుల సైతం స్పందిస్తున్న తీరుకు ఆయన ట్విటర్లో ప్రశంసలు కురిపించారు. గత వారం పేరుకలపూడిలో తాళ్ల అశోక్ కుమార్తెలు భార్గవి, శివస్వాతి ఇద్దరూ తల్లిదండ్రులు తమకిచ్చిన డబ్బును డబ్బీ(ముంత)లో దాచుకున్నారు. ఈ మొత్తాన్ని (సుమారు రూ.2100) తమ గ్రామ పర్యటనకు వచ్చిన లోకేశ్‌కు ఎన్నికల ఖర్చు కోసం వినియోగించమంటూ ఇచ్చేశారు. మంగళవారం రాత్రి ఈమని పర్యటనకు వచ్చినప్పుడు మన్నం అశోక్ కుమారుడు జైదీప్ తాను దాచుకున్న డబ్బును డిబ్బీ సహా ఇచ్చేశాడు. దీనిపై స్పందించిన లోకేశ్ ఏమిస్తే ఇలాంటి అభిమానం దొరుకుతుంది. ప్రజలు ఇంతలా నమ్ముతారు. అందుకే మాట ఇస్తున్నా. ఇలాంటి చిన్నారుల అందరికీ అండగా ఉంటా. వాళ్ల అభివృద్ధికి నిరంతరం శ్రమిస్తా అంటూ ట్విటర్లో ఉంచారు.













