తాను గెలిస్తే…మంగళగిరిని ఆదర్శ నియోజకవర్గంగా మారుస్తా
తాను గెలిస్తే మంగళగిరిని ఆదర్శ నియోజకవర్గంగా మారుస్తామని మంత్రి లోకేష్ అన్నారు. మంత్రి నారా లోకేష్ సమక్షంలో ముస్లిం యువతరం కన్వీనర్ ఎండీ ఇక్బాల్, 2వేల మంది అనుచరులు తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ లోటు బడ్జెట్ ఉన్నా మైనార్టీల అభివృద్ధి కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామని చెప్పారు. దుల్హన్ పథకం కింద ఇచ్చే సహాయాన్ని రూ.లక్షకు పెంచుతామన్నారు. ఇమామ్, మౌజమ్‌లకు గౌరవ వేతనం ఇస్తున్నామని తెలిపారు. అదేవిధంగా విదేశీ విద్యకు సహాయం అందిస్తున్నామని వివరించారు. అర్హులందరికీ పక్కా ఇళ్లు నిర్మించి ఇస్తామని లోకేష్ హామీ ఇచ్చారు.













