ఆ ముగ్గురు దొంగలు కలిసి ఆంధ్రాలో అలజడి
టీడీపీని ఓడించేందుకు ముగ్గురు దొంగలు కలిశారని మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యానించారు. మోదీ, కేసీఆర్, జగన్ కలిసి ఆంధ్రాలో అలజడి సృష్టించాలని చూస్తున్నారని ఆరోపించారు. ఆంధ్రులను కించపరిచిన కేసీఆర్తో జగన్ పొత్తు పెట్టుకున్నాడని, జగన్కు ప్రజలే బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. 31 కేసుల్లో నిందితుడిగా ఉన్న జగన్ ఒక్క ఛాన్స్ ఇవ్వాలని అడుగుతున్నారని, అవినీతిపరుడికి రాష్ట్రాన్ని అప్పగిస్తే రాష్ట్రం అస్థవ్యస్థమవుతుందన్నారు. మంగళగిరిలో మంత్రి నారా లోకేష్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంగళగిరి చేనేత వస్త్రాలకు అంతర్జాతీయ బ్రాండింగ్ తీసుకొస్తామన్నారు. మంగళగిరిలో టెక్స్ టైల్ ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు చేస్తామన్నారు. మార్కెటింగ్ కోసం షాపింగ్ కాంప్లెక్స్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. చేనేత కార్మికులకు ఆదాయం పెంచే విధంగా చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు.













