మంగళగిరిని ఉత్తమ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతా : లోకేష్
మంగళగిరి నియోజకవర్గాన్ని దేశంలోనే ఉత్తమ నియోజకవర్గంగా తీర్చిదిద్దే ప్రణాళికతో వస్తున్నట్లు మంత్రి లోకేష్ పేర్కొన్నారు. మంగళగిరి పట్టణంలోని వివిధ వార్డుల్లో పర్యటించి కాజ, చినకాకానిలోలో ప్రచారం చేశారు. ప్రచారంలో భాగంగా లోకేష్ మాట్లాడుతూ చేనేతలు, స్వర్ణకారుల కోసం ఒక ప్రత్యేక ప్రణాళికలు విడుదల చేశామని, మేనిఫేస్టో కూడా ప్రకటించామని, ఎన్నికల ప్రచారంలో భాగంగా తన దృష్టికి వచ్చిన సమస్యలన్నీ పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. సిట్టింగ్ ఎమ్మెల్యే ఈ ఐదేళల్లో ఏమైనా చేవారా అని ప్రశ్నిస్తూ మళ్లి గెలిస్తే ఏమైనా చేయాలనుకుంటున్నారా, ఆ విషయాలు ఎక్కడైనా చెప్పారా అని తనపై పోటీ చేస్తున్న వైకాపా అభ్యర్థికి, ఆయనకు మద్దతుగా ప్రచారం చేసేందుకు వచ్చేవాళ్లకి సూటి ప్రశ్న వేశారు. తనని తిట్టేందుకు కులసంఘ నేతులు, సినిమా యాక్టర్లు, వైకాపా చెందిన రాష్ట్ర నేతలు మంగళగిరికి వస్తున్నారని, నన్ను తిట్టేందుకు మీరు ఇంత దూరం రావాలా? మీరంతా ఉంటున్న హైదరాబాద్ నుంచే నన్ను తిట్టొచ్చు అని సలహా ఇచ్చారు.













