మంత్రి శ్రావణ్‌కు మంత్రుల అభినందనలు
ముంబైకి చెందిన ప్రముఖ ఆసుపత్రి లీలావతితో పాటు మరో అయిదు అతిపెద్ద ఆసుపత్రులు అమరావతికి త్వరలో రానున్నట్లు మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఇటీవల ప్రాథమిక వైద్య, కుటుంబ సంక్షేమం, గిరిజన సంక్షేమశాఖ మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన కిడారి శ్రావణ్‌కుమార్‌ను ఇతర మంత్రులు చినరాజప్ప, లోకేష్, అఖిలప్రియ, ఎంపీ రామ్మోహన్నాయుడు, ఎమ్మెల్యే అశోక్, వైద్యారోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య కలిసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ వైద్య ఆరోగ్య శాఖ, పంచాయతీరాజ్ శాఖలు సమన్వయంతో పనిచేయడం వల్ల రాష్ట్రంలో మలేరియా జ్వరాలు తగ్గుముఖం పట్టాయన్నారు.













