ఆ బిల్లును ఆమోదించొద్దు … గవర్నర్ను కోరిన చంద్రబాబు
హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు చేయాలని ఒక చీకటీ చట్టాన్ని ప్రభుత్వం తీసుకు వచ్చిందని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ధ్వజమెత్తారు. హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పుపై గవర్నర్ను కలిసి ఫిర్యాదు చేశారు. అసంబద్ధగా, అనైతికంగా ఉన్న ఈ బిల్లును ఆమోదించవద్దని గవర్నర్ను చంద్రబాబు కోరారు. ఈ మేరకు వినతి పత్రాన్ని గవర్నర్కు అందజేఆరు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను ఆయన దృష్టికి చంద్రబాబు తీసుకువచ్చారు. తమ సభ్యులను సప్పెండ్ చేసి మరీ బిల్లును ఆమోదించుకున్నారని ఫిర్యాదు చేశారు.
రాష్ట్రంలో స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం సాగుతోందని, మరోవైపు ప్రతిపక్ష నేతలు, ప్రజలపై కేసులు పెడుతున్నారని గవర్నర్కు వివరించారు. వీటన్నింటినీ పరిశీలించి, జోక్యం చేసుకోవాలని కోరారు. హెల్త్ యూవర్సిటీకి వైఎస్ఆర్ పేరు పెట్టాలని అత్యవసరంగా చట్టాన్ని తీసుకువచ్చాని విమర్శించారు. అన్ని మెడికల్ కళాశాలలు ఒకే గొడుగు కింద పనిచేయాలన్న సంకల్పంతో 1986లో హెల్త్ యూనివర్సిటీని ఎన్టీఆర్ తీసుకువచ్చాని, 1998లో యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు పెట్టినట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 37 మెడికల్ కాళాశాలలు ఉంటే వాటిలో 18 తమ హయాంలోనే వచ్చాయని తెలిపారు. అసెంబ్లీకి తాను 8వ సారి ఎన్నికయ్యానని, సభలో ఇన్ని అసత్యాలను చెప్పిన ముఖ్యమంత్రిని ఇప్పటి వరకు చూడలేదని చంద్రబాబు వ్యాఖ్యానించారు.













