వైసీపీ గూటికి ముద్రగడ్డ ప్రయాణం.. వాయిదా..
గత కొద్ది కాలంగా వైసీపీ తీర్థం పుచ్చుకుపోతున్నట్లు ముద్రగడ్డ హడావిడి చేస్తున్నారు. రేపు వైసీపీలో అధికారికంగా ఎంట్రీ కూడా ఇవ్వబోతున్నట్లు ప్రకటించారు. అయితే సెక్యూరిటీ కారణాలవల్ల కిర్లంపూడి నుంచి తాడేపల్లి వరకు ప్లాన్ చేసిన ర్యాలీని రద్దు చేయాల్సి వచ్చింది. అందుకే ఈనెల 15 లేక 16 న ముద్రగడ ఫ్యామిలీతో సీఎం జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకపోతున్నట్లు తెలియపరిచారు. ఈ విషయాన్ని ముద్రగడ్డ స్వయంగా ఒక లేఖ ద్వారా తెలియపరిచారు. ఇక లేఖలో వైయస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మీద తాను వైయస్ఆర్సీపీలో చేరుతున్నట్లు దీనికి అందరి ఆధరాభిమానాలు ఉంటాయని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. అయితే తాను అనుకున్న కార్యక్రమానికి ఊహించిన దానికన్నా భారీ సంఖ్యలో స్పందన రావడంతో సెక్యూరిటీ ఇబ్బందులు తలెత్తుతాయి అని ..వచ్చిన వారికి కనీసం నుంచోడానికి కూడా స్థలం సరిపోదని భావించి ఈ కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నానని ముద్రగడ్డ పేర్కొన్నారు. ప్రస్తుతం ముద్రగడ్డ రాసిన ఈ లేఖ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో టీడీపీ ,జనసేన శ్రేణులు తమ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నాయి. పార్టీలో చేరకముందే కోతలు మొదలు పెట్టేసాడు అని కామెంట్లు కూడా పెడుతున్నారు.













