ఏపీలో ఒకరికి రెండు!
ప్రతి ఒక్కరి చేతిలో కనీసం ఒక మొబైల్. వీలైతే రెండు. కుదిరితే ప్రతి ఫోన్లో డ్యుయెల్ సిమ్. మరి ఫోన్ కనెక్షన్లు ఎడాపెడా ఎందుకు పెరగవు? ఆంధ్రప్రదేశ్లో 12 ఏళ్ల వయసు దాటిన వారి జనాభా నాలుగు కోట్లు. మరి ఫోన్ కనెక్షన్లు ఎన్నో తెలుసా? ఏకంగా 8.5 కోట్లు. అంటే టీనేజ్ దాటిన ప్రతి ఒక్కరికీ సగటున రెండేసీ ఫోన్ కనెక్షన్లు ఉన్నాయన్నమాట. జియో వచ్చి తర్వాత పరిస్థితి మరింత మారిపోయింది. ఫోన్ కనెక్షన్లపై లోక్సభ సభ్యులు అడిగిన ప్రశ్నలకు టెలికాం శాఖ సమాధానమిచ్చింది. దీన్నిబట్టి అవసరాన్నిబట్టి ఒక్కొక్కరు నాలుగైదు కనెక్షన్లు కూడా వాడుతున్నారని తేలింది.













