సీఆర్ డీఏ చైర్మన్ గా ఆళ్ల!
మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి కీలక పదవి దక్కింది. ముఖ్యమంత్రి జగన్ ఆయనను రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్డీఏ)కు చైర్మన్‌గా నియమించారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులు త్వరలో వెలువడనున్నాయి. మంగళగిరిలో టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌పై ఆళ్ల రామకృష్ణారెడ్డి విజయం సాధించారు. ఆళ్లకు మంత్రిపదవి ఖాయమని భావించినా కేబినెట్లో ఆయనకు స్థానం దక్కలేదు. ఈ నేపథ్యంలో రాజధాని నిర్మాణ బాధ్యతలు పర్యవేక్షిస్తున్న సీఆర్డీఏ సంస్థకు చైర్మన్‌గా నియమిస్తూ ముఖ్యమంత్రి జగన్ నిర్ణయం తీసుకున్నారు.













