2.94 లక్షల కోట్లతో ఏపీ బడ్జెట్ .. శాఖల వారీగా కేటాయింపులు ఇవీ
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. శాసనసభలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ రాష్ట్ర బడ్జెట్ను ప్రవేశపెట్టారు. 2024`2025 ఆర్థిక సంవత్సరానికి రూ.2,94,427.25 కోట్లతో వార్షిక బడ్జెట్ను సభ ముందుకు తీసుకొచ్చారు. బడ్జెట్లో రెవెన్యూ వయ్యం అంచనా రూ.2,34,915.99 కోట్లు, మూలధన వ్యయం అంచనా రూ.32,712.84 కోట్లుగా పేర్కొన్నారు. రెవెన్యూ లోటు రూ.34.743.38 కోట్లు, ద్రవ్య లోటు రూ.68.742.65 కోట్లుగా పయ్యావుల తన బడ్జెట్ ప్రసంగం ద్వారా వెల్లడించారు. బడ్జెట్లో వివిధ కీలక రంగాలకు పెద్ద మొత్తంలో నిధులు కేటాయించారు.
శాఖల వారీగా కేటాయింపులు ఇవీ ..
పాఠశాల విద్య – రూ.29,909 కోట్లు
వ్యవసాయ, అనుబంధ రంగాలు – రూ.11,855 కోట్లు
ఎస్సీ సంక్షేమం – రూ.18,497 కోట్లు
ఎస్టీ సంక్షేమం – రూ.7,557 కోట్లు
బీసీ సంక్షేమం – రూ.39.007 కోట్లు
మైనార్టీల సంక్షేమం – రూ.4,376 కోట్లు
మహిళా శిశు సంక్షేమం – రూ.4,285 కోట్లు
మానవ వనరుల అభివృద్ధి – రూ.1,215 కోట్లు
ఉన్నత విద్య – రూ.2,326 కోట్లు
ఆరోగ్య రంగం – రూ.18,421 కోట్లు
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధికి – రూ.16,739 కోట్లు
పట్టణాభివృద్ధి – రూ.11490 కోట్లు
గృహ నిర్మాణం ` రూ.4,012 కోట్లు
జలవనరులు ` రూ.16,705 కోట్లు
పరిశ్రమలు, వాణిజ్యం – రూ.3,127 కోట్లు
ఇంధన రంగం – రూ.8,207 కోట్లు
రవాణా, రోడ్లు భవనాలు – రూ.9,554 కోట్లు
యువజన , పర్యాటక సాంస్కృతికం – రూ.322 కోట్లు
పోలీస్ శాఖ – రూ.8,495 కోట్లు
పర్యావరణ, అటవీ, శాస్త్ర, సాంకేతిక శాఖ – రూ.687 కోట్లు కేటాయించారు.













