ఇచ్చిన హామీల అమలుకు చర్యలు : పార్థసారథి
రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక కష్టాల్లో ఉన్నప్పటికీ బడ్జెట్ ప్రవేశపెట్టిందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పార్థసారథి అన్నారు. బడ్జెట్‌కు సంబంధించిన అంశాలపై నిర్వహించిన మీడియా సమావేశంలో పార్థసారథి మాట్లాడారు. గత ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడిరదని, వ్యవస్థలను ధ్వంసం చేసి పరిపాలన అస్తవ్యస్తం చేసిందని మండిపడ్డారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను వైసీపీ ప్రభుత్వం చిన్నాభిన్నం చేసిందన్నారు. గత వైసీపీ సర్కారు రూ.1.35 లక్షల కోట్ల మేర బకాయిలు పెట్టి వెళ్లిపోయిందన్నారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిన పెట్టేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు.
సూపర్ సిక్స్ పథకాలను కూటమి ప్రభుత్వం అమలు చేస్తోంది. ఇచ్చిన హామీ మేరకు అన్ని పథకాలను అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. సూపర్ సిక్స్ హమీల్లో ఇప్పటికే రెండు ప్రధాన హామీలు అమలు చేస్తున్నాం. కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే పింఛన్లను రూ.3 వేల నుంచి 4 వేలకు పెంచా. ఉచిత గ్యాస్ హామీ అమలులో భాగంగా రూ.840 కోట్ల నిధులు మంజూరు చేశాం. మరో రెండు పథకాల అమలు కోసం ఈ బడ్జెట్లో నిధులు కేటాయించాం అని తెలిపారు.













