Narayana: ప్రస్తుతం రాజధాని లేని రాష్ట్రం ఏపీ మాత్రమే : నారాయణ
రాజధాని అమరావతిలో మంత్రి నారాయణ (Narayana) పర్యటించారు. ఇప్పటికే పలు పనులకు టెండర్ల ప్రక్రియ పూర్తి కాగా, నిర్మాణంలో ఉన్న కార్యదర్శులు, ప్రధాన కార్యదర్శుల బంగ్లాలను, సీఆర్డీఏ ప్రాజెక్టు కార్యాలయాన్ని మంత్రి పరిశీలించారు. అనంతరం మాట్లాడారు. ఏ రాష్ట్రానికి అయినా రాజధాని అవసరం. ప్రస్తుతం రాజధాని లేని రాష్ట్రం ఏపీ మాత్రమే. రూ.43 వేల కోట్లకు గతంలో మేము టెండర్లు పిలిచాం. అధికారులు, ఎమ్మెల్యేలు (MLAs) , ఎమ్మెల్సీ (MLCs ) , ఆల్ ఇండియా సర్వీస్ భవనాలు దాదాపు పూర్తయ్యాయి. కానీ గత ప్రభుత్వం ఇదేమీ పట్టించుకోలేదు. కూటమి ప్రభుత్వం వచ్చాక కూడా అనేక ఇబ్బందులు వచ్చాయి. ఐఐటీ మద్రాస్ నుంచి నిపుణుల బృందాన్ని పిలిచి బిల్డింగ్ నాణ్యత పరిశీలించి, కాంట్రాక్టర్లతో చర్చించి కొన్ని సమస్యలు పరిష్కరించాం. 90 శాతం పనుల టెండర్లు కంప్లీట్ అయ్యాయి.
ఇవాళ సెక్రటరీ, ప్రిన్సిపల్ సెక్రటరీ భవనాలను పరిశీలించాం. 186 భవనాలు మంత్రులు (Ministers), జడ్జీలు(Judges) , కార్యదర్శులు, ప్రధాన కార్యదర్శులకు వస్తున్నాయి. గెజిటెటడ్ అధికారులకు 1440, ఎన్జీవోలకు 1995 నిర్మాణాలు వస్తున్నాయి. హైకోర్టు 16.85 లక్షల చదరపు అడుగుల్లో వస్తోంది. 250 మీటర్ల ఎత్తులో అసెంబ్లీ భవనం రానుంది. 15రోజుల్లో కాంట్రాక్టర్లకు మౌలిక సదుపాయాలు అందుబాటులోకి వస్తాయి. ప్రజలపై ఒక్క పైసా భారం లేకుండా రాజధాని నిర్మాణం పూర్తి అవుతుంది. వరల్డ్ బ్యాంకు, ఏడీబీ నుంచి రుణాలు తీసుకున్నాం. ల్యాండ్ వాల్యూ పెరిగిన తర్వాత అప్పు తీర్చుతాం అని వెల్లడిరచారు.













