Minister Narayana :మూడేళ్లలో అమరావతి నిర్మాణం పూర్తి : మంత్రి నారాయణ
రాజధాని అమరావతి టెండర్ల ప్రక్రియను జనవరి నెలాఖరులోపు పూర్తిచేసి ఫిబ్రవరి రెండోవారంలో పనులు ప్రారంభిస్తామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి నారాయణ(Narayana) తెలిపారు. రాజధాని ప్రాంతంలో పర్యటించిన మంత్రి నేలపాడు సమీపంలోని అడ్మినిస్ట్రేటివ్ టవర్లను పరిశీలించారు. అనంతరం నారాయణ మీడియాతో మాట్లాడుతూ మూడేళ్లలో అమరావతి(Amaravati) నిర్మాణం పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. న్యాయపరమైన ఇబ్బందులతో పనుల ప్రారంభం ఆలస్యమైందని తెలిపారు. ఇప్పటి వరకు మొత్తం 40 పనులకు టెండర్లు పిలిచామని తెలిపారు. గత ప్రభుత్వం అరాచక పాలనతో ప్రజలను భయభ్రాంతులను గురి చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధానిని ప్రపంచంలోనే టాప్-5లో ఒకటిగా చేయాలనే లక్ష్యంతో ఐకానిక్ భవనాల డిజైన్లను నార్మన్ ఫోస్టర్ చేత చేయించాం. అధికారులు, ఉద్యోగులు(Employees), జడ్జీల (judges) కోసం 2019కు ముందే మొత్తం 4053 అపార్ట్మెంట్ల పనులు ప్రారంభించాం. మాపై కక్షతో గత ప్రభుత్వం నిర్మాణాలను ఆపేసింది. అసెంబ్లీని 250 మీటర్ల ఎత్తులో నిర్మించి, మిగిలిన రోజుల్లో టూరిజం స్పాట్‌గా మార్చాలని డిజైన్లు రూపొందించాం. రాష్ట్ర స్థాయి అధికారులందూ ఒకేచోట ఉండేలా 5 అడ్మినిస్ట్రేటివ్ టవర్లు డిజైన్ చేశాం. విద్యుత్ లైన్లు, డ్రైనేజీలు, తాగు నీటి పైపులు అండర్ గ్రౌండ్లో ఉండేలా డిజైన్ రూపొందించాం అని మంత్రి తెలిపారు.













