కిటెక్స్ ఫ్యాక్టరీ సందర్శించిన మంత్రి నారా లోకేష్
కేరళం రాష్ట్ర పర్యటనలో ఉన్న ఏపీ విద్య ,ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ కిటెక్స్ గార్మెంట్స్ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ సబు ఎమ్. జాకబ్‌ను కొచ్చిలో మంగళవారం కలిశారు. ఈ సందర్భంగా టెక్స్టైల్, దుస్తుల రంగం, తయారీ అవకాశాలు, ఆంధ్రప్రదేశ్‌లో పారిశ్రామిక అభివృద్ధిపై చర్చించారు. ఏపీలో ఉన్న అవకాశాలను పరిశీలించి, అభివృద్ధి ప్రయాణంలో భాగస్వామ్యమవ్వాల్సిందిగా కిటెక్స్ సంస్థను మంత్రి ఆహ్వానించారు.
జాకబ్ ఆహ్వానం మేరకు కొచ్చిలోని కిటెక్స్ ఫ్యాక్టరీని మంత్రి లోకేష్ సందర్శించారు. భారతదేశంలోని ప్రముఖ దుస్తుల తయారీ సంస్థలలో ఒకటైన కిటెక్స్ ఇంతెగ్రతెద్ మనుఫచ్తురింగ్ ఒపెరతిఒన్స్ ప్రత్యక్షంగా పరిశీలించారు.








