మంత్రి లోకేష్ ఎక్కడ నుంచి ?
ఎమ్మెల్సీగా గెలుపొందిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణభివృద్ధి, ఐటీశాఖల మంత్రిగా ఉన్న నారా లోకేష్ వచ్చే ఎన్నికలలో తొలిసారిగా ప్రత్యక్ష ఎన్నికలలో పోటీ చేయనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుమారుడుగానే కాక పార్టీలో బలమైన యువనేతగా పేరొందిన లోకేష్ ఏ స్థానం నుంచి పోటీ చేయనున్నారనే అంశం ప్రస్తుతానికి ఊహాగానాలకే పరిమితమవుతోంది. ఆ ఊహాగానాల పరంపరలో వినవస్తున్న చిత్తూరు జిల్లా కుప్పం, చంద్రగిరి, అనంతపురం జిల్లా హిందూపురం, కర్నూలు జిల్లా నంద్యాల నియోజకవర్గాల్లో ఎక్కడి నుంచి పోటీచేస్తారా. ఇంకేదైనా నియోజకవర్గం నుంచి పోటీచేస్తారా అనే విషయం తేలాలంటే మరికొంత కాలం వేచి చూడాల్సిందే.













