మంత్రి నారా లోకేష్ కు డాక్టర్ ఎపిజే అబ్దుల్ కలామ్ సెంటర్ అవార్డు…
మంత్రి నారా లోకేష్ కు డాక్టర్ కలామ్ ఇన్నోవేషన్ ఇన్ గవర్నెన్స్ అవార్డ్ 2018. ఈ నెల 20 న ఢిల్లీలోని విగ్యాన్ భవన్ లో జరిగే డాక్టర్ ఎపిజే అబ్దుల్ కలామ్ సమ్మిట్ ఆన్ ఇన్నోవేషన్ ఇన్ గవర్నెన్స్ 2018 కార్యక్రమంలో అవార్డ్ అందుకొనున్న మంత్రి నారా లోకేష్. పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల్లో టెక్నాలజీ అనుసంధానంతో గ్రామాల అభివృద్ధి కి తీసుకుంటున్న చర్యలు, అధునాతన సాంకేతికత తో పంచాయతీ రాజ్ శాఖకు రూపొందించిన డ్యాష్ బోర్డ్ కు గాను మంత్రి నారా లోకేష్ కు డాక్టర్ కలామ్ ఇన్నోవేషన్ ఇన్ గవర్నెన్స్ అవార్డ్ 2018.













