Kolusu Parthasarathy: పెట్టుబడులకు గమ్యస్థానంగా ఏపీ : మంత్రి పార్థసారథి
పెట్టుబడులకు గమ్యస్థానంగా ఆంధ్రప్రదేశ్ నిలిచేలా రాష్ట్ర ప్రభుత్వం పాలసీలను రూపొందిస్తోందని రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి (Kolusu Parthasarathy) అన్నారు. క్యాబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను మంత్రి మీడియాకు వెల్లడిరచారు. ఏపీ ఎలక్ట్రానిక్స్ (AP Electronics) తయారీ పాలసీకి మంత్రివర్గం ఆమోదం తెలిపిందని చెప్పారు. దీని ద్వారా పరిశ్రమలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ప్రోత్సాహకాలు లభిస్తాయని తెలిపారు. ఎలక్ట్రానిక్స్ తయారీ పాలసీ ద్వారా యూపీ, గుజరాత్ (Gujarat), తమిళనాడు (Tamil Nadu) లబ్ధిపొందాయి. ప్రత్యేకమైన పాలసీ లేకపోవడంతో పరిశ్రమలకు ప్రోత్సాహకాలు రాని పరిస్థితి నెలకొంది. రాష్ట్రంలో దాదాపు 150 బిలియన్ డాలర్ల వ్యాపారమే లక్ష్యంగా విధానాన్ని రూపొందించాం. పెట్టుబడులు పెట్టేందుకు ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలు ఆసక్తి చూపుతున్నాయి. విశాఖలో ఐటీ సేవల కోసం పలు కంపెనీలు ప్రతిపాదనలు ఇచ్చాయి. రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి ( ఎస్ఐపీబీ)కి వచ్చిన ప్రతిపాదలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. విశాఖలో సిఫి (Sifi) సంస్థ రూ.16,466 కోట్లతో డేటా సెంటర్ ఏర్పాటు చేయనుంది. మధురవాడ (Madhuravada) లో ఆ సంస్థకు 3.6 ఎకరాలు ఇచ్చేందుకు క్యాబినెట్ ఆమోదముద్ర వేసింది అని తెలిపారు.







