Minister Dola :తప్పు చేస్తే ఎవరికైనా చట్ట ప్రకారం శిక్ష : మంత్రి డోలా
పరామర్శల పేరుతో రౌడీలను తీసుకువచ్చి, నిరసన తెలుపుతున్న మహిళలపై దాడి చేయించింది వైసీపీ అధినేత జగనే అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి (Veeranjaneyaswamy) ఆరోపించారు. పొదిలిలో వైసీపీ గుండాల దాడిలో మహిళలు (Women) , పోలీసులు (police) గాయపడ్డారని, దీనిపై జగన్ (Jagan) స్పందించి కనీసం సానుభూతి తెలపకపోగా దొంగే దొంగ అన్నట్టుగా మాట్లాడటం సిగ్గుచేటన్నారు. వైసీపీ గుండాలు మహిళలపై రాళ్లు, చెప్పులతో దాడులు చేస్తుంటే ప్రభుత్వం చూస్తూ ఊరుకోవాలా అని ప్రశ్నించారు. రౌడీలు, మహిళలను కించపరిచే విధంగా వ్యవహరించేవారిని వెనకేసుకొస్తారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పు చేస్తే ఎవరికైనా చట్ట ప్రకారం విక్ష తప్పదని హెచ్చరించారు. తాను ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరిస్తున్నాం కాబట్టే జగన్ స్వేచ్ఛగా రోడ్లపై తిరగగలుగుతున్నారని అన్నారు.













