వారి సంక్షేమానికి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాం : లోకేశ్
మంగళగిరి నియోజకవర్గ అభివృద్ధిలో మాజీ సైనికోద్యోగులు కీలక పాత్ర పోషించాలని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సూచించారు. మాజీ సైనిక ఉద్యోగుల అసోసియేషన్ సభ్యులు లోకేశ్‌ను కలిశారు. 175గజాల ఇంటిస్థలం కేటాయింపు అమలు కావట్లేదని ఆయన దృషికి తీసుకెళ్లారు. ప్రభుత్వ పథకాలు అమలు చేయాలని కోరారు. ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ దేశం కోసం పనిచేసిన వారిని అన్ని విధాలా ఆదుకుంటామన్నారు. మాజీ సైనికుల సంక్షేమానికి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని లోకేశ్ హామీ ఇచ్చారు.













