విద్యార్థుల కోసం DSAT ట్యూటరింగ్ క్లాసులు నిర్వహిస్తున్న MATA, Test Prep Pundits
మన అమెరికా తెలుగు సంఘం (MATA) మరియు టెస్ట్ ప్రెప్ పండిట్స్ (Test Prep Pundits) సంయుక్తంగా విద్యార్థుల కోసం DSAT (డిజిటల్ SAT) ట్యూటరింగ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి. ప్రతిష్టాత్మక ఉన్నత విద్యా సంస్థలలో ప్రవేశం పొందాలనుకునే విద్యార్థులకు మెరుగైన మార్గదర్శకత్వం అందించే లక్ష్యంతో ఈ ఆన్లైన్ శిక్షణను రూపొందించారు.
దీని కోసం 75 డాలర్లను మాత్రమే రుసుముగా ప్రకటించారు. డిసెంబర్ 2 నుంచి డిసెంబర్ 1`8 వరకు ప్రతి బుధవారం, శుక్రవారాల్లో రెండు సెషన్ల చొప్పున నిర్వహిస్తారు. మొత్తం 6 వర్చువల్ సెషన్లు (మొత్తం 12 గంటల బోధన) — ఇందులో మ్యాథ్స్ (4 గంటలు), ఇంగ్లీష్ రైటింగ్ (4 గంటలు), ఇంగ్లీష్ రీడింగ్ (4 గంటలు) ఉంటాయి.
మొత్తం 2 ఫుల్-లెంగ్త్ ప్రాక్టీస్ టెస్ట్లు నిర్వహిస్తారు.
తొలి ఫుల్-లెంగ్త్ ప్రాక్టీస్ టెస్ట్: నవంబర్ 29, 2026 (ఆదివారం)
తుది ఫుల్-లెంగ్త్ టెస్ట్: డిసెంబర్ 19, 2026 (శనివారం) గా వుంటాయి.
ఇక.. అత్యంత సుశిక్షుతులైన టీచర్స్ తో వీటిని నిర్వహిస్తున్నారు. టెస్ట్ ప్రెప్ పండిట్స్ వ్యవస్థాపకులు & CEO, AP Calculus AB/BC టీచర్, HISD హ్యూస్టన్ మ్యాథ్ టీచర్ గా వున్న అన్వర్ బోధిస్తారు. అలాగే 15 ఏళ్ల బోధనా అనుభవం, 7 ఏళ్ల SAT/ACT ట్యూటరింగ్ అనుభవం ఉన్న ఇంగ్లీష్ రీడింగ్ టీచర్ అయిన మిస్ రానా కోరన్, 6 ఏళ్ల అనుభవం ఉన్న SAT/ACT కోచ్, స్టాండర్డైజ్డ్ ఎగ్జామ్స్ ప్రిపరేషన్ నిపుణులు మరియు ఇంగ్లీష్ రైటింగ్ టీచర్ అయిన మిస్టర్ నబిల్ బోధన చేయనున్నారు.
షెడ్యూల్ వివరాలు (EST సమయం ప్రకారం)తేదీరోజుమొదటి సెషన్రెండో సెషన్డిసెంబర్ 2, 2026బుధవారంఇంగ్లీష్ రైటింగ్ (7 PM – 8 PM EST)మ్యాథ్స్ (8:10 PM – 9:10 PM EST)డిసెంబర్ 4, 2026శుక్రవారంఇంగ్లీష్ రీడింగ్ (7 PM – 8 PM EST)మ్యాథ్స్ (8:10 PM – 9:10 PM EST)డిసెంబర్ 9, 2026బుధవారంఇంగ్లీష్ రీడింగ్ (7 PM – 8 PM EST)ఇంగ్లీష్ రైటింగ్ (8:10 PM – 9:10 PM EST)డిసెంబర్ 11, 2026శుక్రవారంఇంగ్లీష్ రీడింగ్ (7 PM – 8 PM EST)ఇంగ్లీష్ రైటింగ్ (8:10 PM – 9:10 PM EST)డిసెంబర్ 16, 2026బుధవారంఇంగ్లీష్ రైటింగ్ (7 PM – 8 PM EST)మ్యాథ్స్ (8:10 PM – 9:10 PM EST)డిసెంబర్ 18, 2026శుక్రవారంఇంగ్లీష్ రీడింగ్ (7 PM – 8 PM EST)మ్యాథ్స్ (8:10 PM – 9:10 PM EST)డిసెంబర్ 19, 2026శనివారంఫుల్-లెంగ్త్ టెస్ట్ఫుల్-లెంగ్త్ టెస్ట్
మిగిలిన సమాచారం కోసం www.testpreppundits.com మరియు www.mata-us.org వెబ్ సైట్ తో పాటు +1 844-383-7844, +1 713-714-7347,+1 888-7MATAUS, +1 (888) 762-8287 నెంబర్లలో కూడా సంప్రదించవచ్చును.







