40 ఏళ్ల అనుభవంతో 40 ఏళ్ల అవినీతి పరుడికి పోలికా ?
వైసీపీ అధినేత వైఎస్ జగన్పై ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణ తీవ్ర విమర్శలు చేశారు. 40 ఏళ్ల అనుభవం ఉన్న చంద్రబాబుతో 40 ఏళ్ల అవినీతి పరుడిని పోలుస్తారా? అని ధ్వజమెత్తారు. అభివృద్ధిలో దూసుకుపోతున్న ఏపీ రాజకీయాల్లో వేలు పెడుతూ కేటీఆర్ ఏదో సాధించేశారని చెప్పుకోవాలనుకోవడం సిగ్గుచేటు అని అన్నారు. ఏపీపై అంత ప్రేమ ఉంటే మొన్నటి ఎన్నికల్లో నేరుగా పోటీ చేసేందుకు ఎందుకు వెనకాడారు అని ప్రశ్నించారు. అవినీతి పరుడికి అధికారం కట్టబెట్టేందుకు ఏపీ ప్రజలు సిద్ధంగా లేరన్నారు. టీడీపీ భారీ మెజార్టీతో గెలవబోతోందని మంతెన ధీమా వ్యక్తం చేశారు.













