Mahanadu : అంగరంగ వైభవంగా మహానాడు ప్రారంభం
కడపలో తెలుగుదేశం పార్టీ మహానాడు (Mahanadu) అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. పార్టీ అధినేత చంద్రబాబు (Chandrababu) మహానాడు ప్రాంగణంలోని చిత్తూరు పార్లమెంట్ ప్రతినిధుల నమోదు కేంద్రం లో పేరును రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఫొటో ప్రదర్శనను తిలకించారు. ఎన్టీఆర్ విగ్రహానికి (NTR statue) నివాళి అర్పించారు. ముఖ్య నాయకులను వేదికపై ఆహ్వానించి చంద్రబాబు పార్టీ జెండాను ఆవిష్కరించారు. వేదికపై మా తెలుగుతల్లికి గీతాలాపన చేశారు. మృతి చెందిన పార్టీ కార్యకర్తలకు, నేతలకు మహానాడు వేదికగా నాయకులు సంతాపం వ్యక్తం చేశారు. ఇటీవల కాలంలో 1,033 మంది చనిపోయినట్లు సోమిశెట్టి వెంకటేశ్వర్లు (Somisetti Venkateswarlu) వెల్లడిరచారు. పహల్గాం (Pahalgam) ఉగ్రదాడిలో మరణించిన వారికి హానాడులో సంతాపం తెలిపారు. 2024 ఎన్నికల్లో పార్టీ ఘన విజయం తర్వాత జరుగుతున్న తొలి మహానాడును మూడు రోజులపాటు నభూతో అన్న రీతిలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఇందులో పాలుపంచుకునేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చారు.













