ఆగస్టు 12 నుంచి మహాసంప్రోక్షణ
ఆగస్టు 12 నుంచి 16 వరకు శ్రీవారి ఆలయంలో మహాసంప్రోక్షణ కార్యక్రమం నిర్వహించనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో సింఘాల్ తెలిపారు. 5 రోజుల పాటు శాస్త్రోృక్తంగా పూజాది కార్యక్రమాలు జరుగుతాయని చెప్పారు. ఈ నెల 10, 24న వయోవృద్ధులకు, 11, 25న చంటి బిడ్డ తల్లిదండ్రులకు శ్రీవారి దర్శనం కల్పించనున్నట్లు ఈవో తెలిపారు. సర్వదర్శనం స్లాట్ ద్వారా ప్రతి నెల 5.5 లక్షల మందికి శ్రీవారి దర్శన భాగ్యం కలుగుతోందని అన్నారు. కురుక్షేత్రంలో రూ.30 కోట్లతో శ్రీవారి ఆలయ పనులు పూర్తి చేశామని, కురుక్షేత్రంలో శ్రీవారి విగ్రహ ప్రతిష్ట చేశామని తెలిపారు. అలాగే కన్యాకుమారి, హైదరాబాద్లో శ్రీవారి ఆలయాల నిర్మాణ పనులు వేగవంతంగా జరుగుతున్నాయన్నారు. అలిపిడి నడక మార్గంలో 10 వేల మొక్కలు నాటామని పేర్కొన్నారు.













