టీడీపీకి మాగుంట రాజీనామా
తెలుగుదేశం పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు, ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి ప్రకటించారు. ఒంగోలులోని తన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో వైకాపా అధికారంలోకి రావాలని అందరూ కోరుకుంటున్న నేపథ్యంలో తాను ఆ పార్టీలో చేరనున్నట్లు తెలిపారు. ఒంగోలు విడిచి వెళ్లొదని ప్రజలు కోరుతున్నారని.. తనకు రాజకీయ భవిష్యత్తును ఇచ్చిన ప్రకాశం జిల్లాను ఎన్నటికీ వీడేది లేదని తెలిపారు. 2014లో అప్పటి పరిస్థితులకు అనుగుణంగా కాంగ్రెస్ పార్టీ బలహీన పడటంతో చంద్రబాబు సూచన మేరకు టీడీపీలో చేరానన్నారు. చంద్రబాబుతో తమ కుటుంబానికి ఉన్న సంబంధాల దృష్ట్యా గత ఐదేళ్లలో అన్నివిధాలా ఆయన గౌరవించారని తెలిపారు.













